Tuesday, November 17, 2009

prajaswamyam

ఓట్లకోసం నోట్లో మందు
మళ్ళీ ఐదేళ్ళదాకా అదే నోట్లో మన్ను !
గద్దెనెక్కగానే...
వాళ్లకి కోట్లు, కోట్లు చేసే చోట్లు, etc etc
మనకు మళ్ళీ అవే పాట్లు, అగచాట్లు, గట్రా గట్రా
మొత్తానికి...
ప్రజాస్వామ్యానికి తూట్లు
విలువలకు చెల్లుచీట్లు

Thursday, November 12, 2009

Jagan wants to be CM

జగన్నిక  సీఎం చేద్దాం
గనులన్నీ 'గాలి'కొదిలేద్దాం
ప్రజాసేవకు ప్రతిఫలమొద్దా?
రాష్ట్రాన్నే రాసిచ్చేద్దాం ! 
ప్రజాధనం  
ప్రభుత్వం చేతుల్లో వుంటే ఏంటి?
పాలకుల ఖాతాల్లో వుంటే ఏంటి?

Sunday, November 08, 2009

Greater Elections

ఎన్నికలొచ్చాయంటే ఎన్నెన్ని చిత్రాలు
నాయక ప్రతినాయకుల తంత్ర కుతంత్రాలు 
అరచేతిలో దివిని చూపే అజెండాలు 
అవసరం తీరిందంటే ఎత్తేసే జెండాలు 
అమ్మా డెమోక్రసీ నీకు శతకోటి దండాలు !

Thursday, November 05, 2009

"Maa Telugu Talliki" banned in Telangana

"మా తెలుగు తల్లికి ముళ్ళతో దండ
మా కన్నతల్లికి అమంగళారతులు"
ప్రాంతీయతత్వ దుర్గంధం
సాహిత్యానికీ పూస్తుంటే
శంకరంబాడి ఆత్మ క్షోభిస్తోందేమో 
నేరో మైండ్లను చూసి రోదిస్తోందేమో !

Kondaa Gaali

కొండా గొడవ గాలి గొడవ 
రెండూ ఒక్కటే...
ముఖ్యమంత్రిని మార్చాలి.
ప్రజా ప్రభుత్వాన్ని
ప్రైవేటైజ్ చెయ్యాలి !

Wednesday, November 04, 2009

Lok Satta... Good luck for Greater elections !!

ఒక్క సీటే చాలు...
జేపీకి  జేజేలు !
బీపీని పెంచదా, చెమట పట్టించదా?
నోట్లు పంచే వాళ్ళ నోళ్ళు మూయించదా !

Praja Rajyam supporting Congress?

గోవిందా హరి  గోవిందా...
చిరు ప్రరాపా గోవిందా !
కాంగ్రెస్ పంచన చేరిందా
వంచన కాదా గోవిందా !